Cat-1

Cat-3

Cat-4

» » పోలీస్‌ సినిమా రివ్యూ






నటీనటులు: విజయ్‌.. సమంత.. అమీజాక్సన్‌.. రాధిక.. బేబి నైనిక.. తంబి రామయ్య.. ప్రభు.. కాలి వెంకట్‌.. జె.మహేంద్రన్తదితరులు సంగీతం: జి.వి.ప్రకాష్కుమార్ ఛాయాగ్రహణం: జార్జ్సి.విలియమ్స్ ఎడిటింగ్‌: ఆంథోనీ ఎల్‌.రూబెన్ నిర్మాణం: కలైపులి ఎస్థాను.. దిల్రాజు కథ.. దర్శకత్వం: అట్లీ కుమార్ విడుదల: 15-04-2016

అగ్ర కథానాయకుల్ని మాస్కథల్లో చూపించడానికే ఇష్టపడుతుంటారు దర్శకులు. వారికున్న ఇమేజ్‌.. అంచనాలతో పాటు.. అభిమానులను దృష్టిలో ఉంచుకొని దర్శకులు పెద్దగా ప్రయోగాలు చేయడానికి ఇష్టపడరు. అయితేరాజా రాణిలాంటి విభిన్నమైన సినిమాని అందించిన యువ దర్శకుడు అట్లీతో విజయ్కలిసి సినిమా చేశారంటే కథలో ఏదో ఒక కొత్త అంశం ఉండే ఉంటుందని భావిస్తారు. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చినపోలీస్‌’ సినిమా ఎలా ఉందో చూస్తే..
 
థేంటంటే...?: నీతి నిజాయతీ కలిగిన ఐపీఎస్ అధికారి విజయ్కుమార్‌ (విజయ్). డాక్టరైన మిత్ర(సమంత)ని ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు. వారిద్దరి ముద్దుల కుమార్తె నైనిక. అన్యోన్యమైన కాపురం వాళ్లది. ఇంతలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం జరుగుతుంది. అందుకు కారకుడైన రాజకీయ నాయకుడి కొడుకుని విజయ్ చంపేస్తాడు.
దీంతో నాయకుడు పోలీసు కుటుంబంపై కక్షగడతాడు. అందరినీ మట్టుబెట్టాలని నిర్ణయించుకొంటాడు. ప్రయత్నంలో విజయ్కుమార్, కూతురు నైనిక మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. మిగిలిన వారంతా చనిపోతారు. తన ముద్దుల కూతురి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని కేరళకి వెళ్లి స్థిరపడతాడు విజయ్. జోసెఫ్ కురువిల్లా అనే పేరుతో కేరళలో స్థిరపడ్డ విజయ్కుమార్ అసలు రూపం ఎలా బయటపడుతుంది? విజయ్తో పాటు అతని కూతుర్ని చంపాలనుకున్న వారిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్న విషయాల్ని వెండితెర మీద చూడాల్సిందే.
 
ఎలా ఉందంటే?: పగ.. ప్రతీకారం నేపథ్యంలో సాగే మాస్ మసాలా సినిమా ఇది. కథ.. కథనాలు సాదాసీదాగా సాగుతాయన్న భావన కలుగుతుంది. ప్రతీ సన్నివేశం ప్రేక్షకుడి వూహకి తగ్గట్టుగానే సాగుతుంటుంది.
తొలి సగభాగం విజయ్కుమార్.. కూతురు మధ్య సరదాగా సాగుతుంది. స్కూల్ టీచర్(అమీజాక్సన్) ముందు మంచి తండ్రి అనిపించుకొనేందుకు విజయ్ చేసే ప్రయత్నాలు నవ్వుల్ని పంచుతాయి. విశ్రాంతికి ముందు వచ్చే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. సినిమాలో విజయ్ హీరోయిజం పైనేదర్శకుడు దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తుంది. స్క్రీన్ప్లే విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది.
 
ఎవరెలా చేశారంటే?: సినిమాకి విజయ్.. బేబి నైనికలు కీలకం. తండ్రిగా విజయ్.. ముద్దుల కూతురుగా నైనిక ఆకట్టుకుంటారు. కథానాయిక మీనా కూతురు నైనిక చక్కటి హావభావాల్ని పలికించింది. సమంత తన పాత్ర పరిధి మేరకు నటించింది. అమీజాక్సన్ కొత్త లుక్లో దర్శనమిస్తుంది. ప్రతినాయకుడు మహేంద్రన్ మెప్పించాడు. జి. వి. ప్రకాష్కుమార్ బాణీలు వినసొంపుగా లేకున్నా.. నేపథ్య సంగీతం బాగుంది.
 
జార్జ్ విలియమ్స్ కెమెరా పనితనం ఆకట్టుకునేలా ఉంది. కలైపులి ఎస్.థాను నిర్మాణ విలువలు అడుగడుగునా కనిపిస్తుంటాయి. సినిమాలో అక్కడక్కడా వేగం తగ్గినట్టు అనిపిస్తుంటుంది. ఆంథోనీ తన కత్తెరకి పదును పెట్టాల్సింది. దర్శకుడు తాను అనుకున్న కథని అనుకున్నట్లే తెరకెక్కించాడు.
 
బలాలు
+ విజయ్.. నైనిక
+ ఫస్ట్ హాఫ్
+ నేపథ్య సంగీతం
+ ఛాయాగ్రహణం
బలహీనతలు
- రొటీన్ కథ

 

«
Next
Newer Post
»
Previous
Older Post

About the Author newsreviews9

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

No comments

Leave a Reply